కొత్త మద్యం పాలసీ ఖరారు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు లో మార్పు లేదు.. స్లాబ్స్ కూడా గతం లో లాగానే 6 ఉంటాయి అని తెలిపింది. లైసెన్స్ ఫీజు లో కూడా మార్పు లేదు. దరఖాస్తు ఫీజ్ 2 లక్షలు.. 6 స్లాబ్స్ ఉంటాయి. 5 వేల జనాభా వరకు 50 లక్షలు లైసెన్స్ ఫీ… 5 వేల 1 నుండి 50 వేల 55 లక్షలు… 50 వేల 1 నుండి లక్ష వరకు… 60 లక్షలు… లక్ష నుండి 5 లక్షల వరకు జనాభాకు 65 లక్షలు… 5 లక్షల 1 నుండి 20 లక్షలు వరకు 85 లక్షల ఫీజు.. ఇక 20 లక్షల పై జనాభా ఉంటే కోటి పది లక్షలు లైసెన్స్ ఫీజు ఏడాదికి ఉంటుంది అని తెలిపింది.
అయితే కోవిడ్ నేపథ్యంలో ఒక నెల గడువు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం.. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించింది. గౌడ్స్ 15 శాతం, ఎస్సి 10 శాతం, ఎస్టీ 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఇక కొత్త మద్యం పాలసీ డిసెంబర్ ఒకటి నుండి అమలు లోకి రానుండగా… 2021 డిసెంబరు ఒకటి నుండి 2023 నవంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది.