నిరుద్యోగులు పిట్టల్లా రాలుతుంటే పట్టించుకోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయన్నారు టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సులో పాల్గొన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 3శాతం వున్న నిరుద్యోగం ఏడున్నర ఏళ్లలో మూడింతలు 8శాతానికి పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే నిరుద్యోగం తగ్గిందా… పెరిగిందా ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలి.
తెలంగాణలో ఇప్పటి వరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80 వేలలోపే, కానీ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దం చెప్పడం సిగ్గుచేటు. ఈ సంఖ్యపై దమ్ముంటే బహిరంగ చర్చకు నేను సిద్దం, దీనికి సీఏం కేసీఆర్ సిద్దమా ? అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఏడాదిలోనే 21 మంది నిరుద్యోగులు చనిపోయారు. డిసెంబరు 3న హైదరాబాదులో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే కార్యక్రమానికి నిరుద్యోగులు, యువకులు భారీగా తరలి రావాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?