గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు.…
ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు. ఏం జరిగిందంటే..?ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక లాంటి ఎన్నికలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నానని… ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు అన్నీ.. ఇన్నీ కాదని ఈటల ఆరోపించారు. రూ.వందల కోట్లను స్వయంగా పోలీసులే తీసుకొచ్చి పంచారని.. కమలాపూర్లో అయితే ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి డబ్బులు పంచారని ఈటల విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో హుజురాబాద్ ప్రజలు అదే ఫలితాన్ని ఇచ్చారని సంతోషం…
తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్…
తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు భారీ స్థాయిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా మేడారం జాతరకు పేరుంది. ఈ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు విడుదల చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని… కేసీఆర్ బీజేపీ పై అనేక విమర్శలు చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీని భయపెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ భయపెట్టినంత మాత్రాన బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదని హెచ్చరించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచి…
నల్గొండ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన విలియమ్స్ అనే వ్యక్తి ఓ చర్చిలో పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే అదునుగా చర్చికి వచ్చే మహిళలను అతడు టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానంటూ వారి వెంట పడేవాడు. ఆ తర్వాత మహిళలను లోబరుచుకుని పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు అతడు 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Read Also: పంజాగుట్ట పాప హత్య కేసులో…
కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి లో ఉంది. ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. అందరికీ సమస్యలు ఉన్నాయి… కానీ పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి. కోమటిరెడ్డి నేరుగా సోనియా గాంధీ తో మాట్లాడే వెసులు బాటు ఉంది. Vh మాట్లాడుతున్నారు కోమటిరెడ్డితో అని చెప్పారు. నేను కూడా ఇంకొంత మంది నాయకులతో మాట్లాడతా… కలిసి పని చేయాల్సిన సమయం ఇది. హుజూరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు రావడం ఇబ్బందే.…
కొత్త మద్యం పాలసీ ఖరారు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు లో మార్పు లేదు.. స్లాబ్స్ కూడా గతం లో లాగానే 6 ఉంటాయి అని తెలిపింది. లైసెన్స్ ఫీజు లో కూడా మార్పు లేదు. దరఖాస్తు ఫీజ్ 2 లక్షలు.. 6 స్లాబ్స్ ఉంటాయి. 5 వేల జనాభా వరకు 50 లక్షలు లైసెన్స్ ఫీ… 5 వేల 1 నుండి 50 వేల 55 లక్షలు… 50 వేల 1…
తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయన్నారు టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సులో పాల్గొన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 3శాతం వున్న నిరుద్యోగం ఏడున్నర ఏళ్లలో మూడింతలు 8శాతానికి పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే నిరుద్యోగం తగ్గిందా… పెరిగిందా ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలి. తెలంగాణలో ఇప్పటి వరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80 వేలలోపే, కానీ సీఏం…