Ponnam Prabhakar : హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గుల్జార్ హౌజ్ వద్ద ఈ నెల 18న జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ప్రభుత్వ చర్యలపై స్పష్టతనిచ్చారు. ఈ విచారణ కమిటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ…
కాళేశ్వరం కమిషన్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో…
Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షల సంఖ్యలో యువత ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గానికి…
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.
హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే…
CM Revanth Reddy : మహిళల శక్తిని ప్రేరణగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మహిళా స్టాళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ..…
Bandi Sanjay : తెలంగాణలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వమే విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు…
CM Revanth Reddy : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే రెండేండ్లలో.. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణా పై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా…