కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్…
Revanth Reddy: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ‘మే’…
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు..
గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పరీక్షపై టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యత అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్ ఛైర్మన్ గా శాంతి కుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవి విరమణ తర్వాత.. ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
Telangana : హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్ సోమవారం నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి , బి.ఎస్.జగ్జీవన్ కుమార్‌లు తమ విధులను…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం…
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని.. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) రెండు ప్రముఖ జపాన్ సంస్థలతో కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. టోక్యోలో అధికారిక పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రెవంత్ రెడ్డి సమక్షంలో, TERN (TGUK Technologies Pvt. Ltd.) , రాజ్ గ్రూప్ సంస్థలతో ఈ…