Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి గన్ పార్క్ , సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో వారు పాల్గొంటారు.
Nigeria: ఘోర రోడ్డుప్రమాదం.. జాతీయ క్రీడల నుంచి వస్తూ 21 మంది క్రీడాకారులు మృతి..!
అంతేకాక, ఈ బృందం ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కితాక్యూషూ సిటీతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేయనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు. అప్పట్లో ఆహ్వానం అందుకున్న మేయర్ ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా హాజరవుతున్నారు. గతంలో అధిక కాలుష్యంతో బాధపడిన కితాక్యూషూ నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి సైతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో ఈ ఒప్పందం ద్వారా సహకారం లభించే అవకాశముంది.
Amritha Aiyer : స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హనుమాన్ బ్యూటీ..