కేసీఆర్ ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ..వ్యవస్థలు శాశ్వతమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని హితువు పలికారు. గవర్నర్ ని కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మునుగోడులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్న అనే ఆందోళనలో ఉన్నారని…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు. అందుకే.. ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. తాను సింగిల్గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్గానే పోటీ…
రామాయణంలో రాముడికి హన్మంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తనకు సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడిగా పని చేస్తానని తెలిపారు. గురువారం పార్టీలో చేరినవారిని ఘనస్వాగతం పలికిన రేవంత్.. ఈ సందర్భంగా…
ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజం. ఇది రాజకీయ తంత్రం.. ఎప్పుడు, ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్ళే రేపు చేతులు కలపొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. రైతు సంఘర్షణ సభలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కాంగ్రెస్…
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారతీయ జనతా పార్టీ రాబోయే రెండేళ్లలో జరిగే వివిధ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం ఎన్నికల కోసం పనిచేయటం బీజేపీ ప్రత్యేకత. నిరంతరం గెలుపు వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటుంది. ఉత్తరాదితో పాటు ఈశాన్య భారతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కానీ దక్షిణాది విషయంలో ఆ పరిస్థితి లేదు. కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో అధికారం…