Pocharam Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. కేసీఆర్ అది జరగనివ్వరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Srinivas Reddy Says He Will Contest As MLA In Next Elections: కామారెడ్డి బీర్కూర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ సమీక్ష అవసరమని.. అప్పుడు తప్పొప్పులు, లోటుపాట్లు బయటకు వస్తాయని వివరించారు. ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎవరు తప్పు చేసినా.. అది ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పు చేస్తే మాత్రం తరిమికొడతారని ఉద్ఘాటించారు. తప్పులు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదని.. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టండని.. మీ వెనకే నేను ఉంటానని పిలుపునిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని హితవు పలికారు.
ఇదే సమయంలో పోచారం శ్రీనివాస రెడ్డి కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులు పెట్టొద్దు, వడ్లు కొనద్దని కేంద్ర ప్రభుత్వం చేప్తోందని.. అదే జరిగితే కార్పొరేట్ వ్యవస్థలు వాలుతాయని అన్నారు. రైతులు తమ భూముల్లో తామే కూలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అసలు కేంద్ర ప్రభుత్వం.. దేశానికి అన్నం పెట్టదలుచుకుందా? సున్నం పెట్టదలుచుకుందా? అని నిలదీశారు. రాబోయే రోజుల్లో ప్రమాదమైన పరిస్థితి రాబోతోందని సూచించిన ఆయన.. రైతులకు కనీస మద్దతు ధర రూ. 2000 లేకుండా, అప్పుడు కార్పొరేట్ వాళ్లకు రూ. 1000కే అమ్మాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పొలాల్లో బోర్లకు మోటర్లు పెట్టమంటోందని.. అయితే కేంద్రం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, కేసీఆర్ ఉన్నన్ని రోజులు అది జరగనివ్వరని పోచారం శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!