కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులపై జానారెడ్డి స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి, బెదిరించడానికే ఈ దాడులని తెలిపారు.
సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి... సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ సెంటిమెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ పాతది అయిపోయింది.. ఇంకా ఏదైనా కొత్తది తెచ్చుకోవాల్సిందే.. చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మొదటి రోజు మీడియా సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు అని ఆరోపించారు. కోళ్ళ దాన కుంభకోణంలో 3 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. పొందుర్తి వద్ద ఆయనకు బీజేపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని విమర్శించారు. 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు.. కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ది జూటా సెక్యులరిజం అని దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం.. సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలి.. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు , అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు.