మాజీ హెచ్‌సీఏ అధ్యక్షులు అజారుద్దీన్ కు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట.. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన మల్కాజ్‌గిరి కోర్టు..
కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి పని చేశాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది.
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది.
దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ జిల్లాను సర్వనాశం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది.. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు.. ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారు.. ఇలాంటి వారికి తగిన ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన చెప్పుకొచ్చారు. Read Also: Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం…
భారతదేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు అని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు.. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది.
ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు రాజీనామా చేశారు.
రైతు బాగుంటే రాజ్యం బాగుంటది అని రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ అని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒక కేసీఆర్ ది.. రైతు పండించిన పంట అంత కేసీఆర్ ప్రభుత్వమే కొనుగోలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.