Harish Rao: స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు. మనం గట్టిగా కష్టపడితే సంగారెడ్డిలో జగ్గారెడ్డి గాలిలో కొట్టుకుపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సర్వే చూసినా హ్యాట్రిక్ సీఎం కేసీఆరే అని చెబుతున్నాయని తెలిపారు. జగ్గారెడ్డి గత ఎన్నికల్లో ఎన్నో మాయమాటలు చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amit Shah: మరోసారి ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ?
ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరుకు కూడా జగ్గారెడ్డి రాలేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి.. తెలంగాణ వద్దన్నాడని మండిపడ్డారు. సంగారెడ్డిని తీసుకుపోయి కర్నాటకలో కలపాలని అన్నాడని తెలిపారు. ఇదిలా ఉంటే.. షర్మిలతో కాంగ్రెస్ చేతులు కలిపిందని, తెలంగాణని వ్యతిరేకించిన వైఎస్ కూతురు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా.. లో లోపల చంద్రబాబు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు వాయిస్ ను బీజేపీ నుంచి పురంధరేశ్వరి వినిపిస్తుంది..
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠాలా తయారయ్యిందని.. తెలంగాణ ద్రోహులతో రేవంత్ రెడ్డి స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గెలవాలంటే కేసీఆర్ కి ఓటెయ్యాలని.. తెలంగాణ ఓడిపోవాలంటే కాంగ్రెస్ కి ఓటెయ్యాలని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఓడాలా.. గెలవాలా అని ఆయన అన్నారు. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి క్రిమినల్ అంటున్నాడని, రేవంత్ ఓ క్రిమినల్.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీ నెంబర్ 4170 రేవంత్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు.