నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉంటాడు.. నా కోసం కష్టపడే దాంట్లో రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని షబ్బీర్ అలీ కోరారు.
తెలంగాణలో చీటింగ్.. కరప్షన్ ప్రభుత్వం ఉందని సీబ్ల్యూసీ సభ్యులు పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. యువతని మోసం చేసింది.. తెలంగాణ నిరుద్యోగంలో 15 శాతం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
TS Nominations: కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్ల నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. breaking news, latest news, telugu news, bi news, MCC, Telangana Elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో రాష్ట్ర సీపీఐ తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడం సీటు ఇచ్చినా... మునుగోడులో పోటీ చేస్తామని నల్గొండ జిల్లా సీపీఐ నేతలు అంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలొస్తే ప్రతిసారి గందరగోళం ఉంటుందన్నారు. ఇంకా మనలో పరిణితి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఏ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో పరిణతి ఉందో ఆ దేశాలు ముందుకు పోతున్నాయని అన్నారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది.. అదే మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని చెప్పారు.…