ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అయితే, ఈనెల 10వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తాం.. మూడు వాహనాలకు అనుమతి.. ఐదుగురికి మాత్రమే ఆర్వో ఆఫీసులోకి పర్మిషన్.. నామినేషన్ వేసే అభ్యర్థులు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నుంచే ఖర్చు చేయాలి.. డిపాజిట్ కోసం చెక్స్ తీసుకోరు.. ఈనెల 10 తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వికాస్ రాజ్ వెల్లడించారు.
Read Also: Lawrence: గురువుకే గుదిబండలా మారిన లారెన్స్?
ఈనెల 10 తర్వాత ఓటర్ స్లిప్స్ ప్రింటిగ్ స్టార్ట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఆర్వో ఆఫీసులో ఫిర్యాదుల సెల్ ప్రారంభించాలని సూచించాము.. గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ స్టేషన్లు పెరిగాయి.. పీబ్ల్యూడీ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. బ్రెయిలీలో కూడా బ్యాలెట్ పేపర్ ముద్రిస్తాం.. మిషన్ 29 కింద ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతాన్ని పెంచుతామని వికాస్ రాజ్ వెల్లడించారు.
Read Also: Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు
అయితే, ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చని తెలిపారు.. డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చెల్లించాలని ఆయన సూచించారు. అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలు రెడీ చేస్తున్నామని సీఈఓ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.