కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోమ్ ఓటింగ్ పూర్తి అయిందని.. లక్షా 68 వేల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
సీఎం కేసీఆర్ జగిత్యాల ప్రజాశీర్వదా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆగం కావద్దు నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు. జగిత్యాలలో ఎవరు గెలుస్తారో ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో, 10 ఏండ్ల BRS పాలన ఎలా ఉందో గమనించాలని కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి జీవన్ రెడ్డి సమైక్య ఆంధ్రుల తరపున తన…
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలువద్దనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు అని దుయ్యబట్టారు.
కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.