Telangana Elections 2023: ఉమ్మడి మెదక్ జిల్లాలో అగ్రనేతల పర్యటనలకు పార్టీలు బెదిరిస్తున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకేరోజు బహిరంగ సభలు నిర్వహించారు.
Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిజ ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖలో వివరించారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ కోసం ఒకరి తర్వాత ఒకరు జాతీయ నాయకుల క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
PM Modi: తెలంగాణలో ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గర పడింది. దీంతో పాటు జాతీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచి తమ అగ్రనేతలను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో పెద్ద పెద్ద నేతలు తుఫాన్ పర్యటనలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
సీఈఓ వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ కలిసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలపై ఫిర్యాదు చేసింది. మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ పై చేసిన విమర్శల పై సీఈఓకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ లీగల్ టీం హెడ్ సోమా భరత్ పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్, కూకట్ పల్లిలో వివేకానంద నగర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్‌లలో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ తో పాటు రోడ్ షోతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.