ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని…
జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. న
MLC Kavitha: నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నవిపేటలో ఎమ్మెల్సీ కవిత రోడ్ షో నిర్వహించారు.
Revanth Reddy: చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే నారాయణపేట జిల్లా అయింది... ఇక్కడ కనీస మౌళిక వసతులు లేవన్నారు.
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీని దెబ్బ తీసేందుకు కావాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Minister KTR: నాకు వచ్చిన ఈసీ నోటీస్ లకు బదులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే..
Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు... కొనసాగుతున్న స్కీమ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం నవంబర్ 29, 2013 న కేసీఅర్ ఆమరణ దీక్ష కు దిగారని గుర్తు చేశారు. కేసీఅర్ పోరాటంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 4వ బహిరంగ లేఖ రాశారు. విభజించి పాలించే బ్రిటిషర్ల పాలనా విధానాన్ని మీరు చాలా చక్కగా ఆకళింపు చేసుకుని పాటిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా.. మీ ఆలోచనలు, మీ నాయకుల స్వలాభం కోసం జిల్లాల విభజన జరగడం.. దీనికి మంచి ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని…