తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుంది. దీంతో పాటు.. రైతుల అవసరాలకు సంబంధించిన పరికరాలను అందించే యోచనలో సర్కార్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం…
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎ రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అధికారులు ఇసుక రీచ్ ల…
Road Transport and Highways: జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” ద్వారా కీలకమైన మైలిస్టోన్లు సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్రం అదనపు ప్రోత్సాహక సహాయం పొందింది. ఈ పథకం కింద తెలంగాణకు మొత్తం 176.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 లో భాగంగా 51.5 కోట్లు, మైల్స్టోన్ 2 లో 125 కోట్లు అర్హత సాధించింది. అంతేకాక, మోటార్ వెహికల్ టాక్స్…
MP K.Laxman : కరోనా లాంటి గడ్డు పరిస్థితి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారన్నారు. ఇదొక మైల్ స్టోన్ అని, దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆర్థికంగా ఎంత…
Kunamneni Sambasiva Rao : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత సష్టంగా కనిపించిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దాదాపు సగం లోకసభ స్థానాలు బీజేపీ ఎంపిలు గెలిచినా రాష్ట్రానికి సాధించింది సున్నా అని ఆయన అన్నారు. విభజన హామీలను పదకొండేళ్ళువుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ…
KTR: జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు…
Harish Rao : కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందని, కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి…
TPCC Mahesh Goud : తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందన ఆయన…
Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని, నా ఛాలెంజ్ కు స్పందించి కేసీఆర్ బయటికి రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తడాఖా తెలిసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని, నాలాంటి వాళ్లు పదవి త్యాగం చేయడం…