Road Transport and Highways: జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” ద్వారా కీలకమైన మైలిస్టోన్లు సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్రం అదనపు ప్రోత్సాహక సహాయం పొందింది. ఈ పథకం కింద తెలంగాణకు మొత్తం 176.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 లో భాగంగా 51.5 కోట్లు, మైల్స్టోన్ 2 లో 125 కోట్లు అర్హత సాధించింది. అంతేకాక, మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం 50 కోట్లు అర్హత సాధించింది. మైల్స్టోన్ 2 కింద, రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేసే ప్రణాళికను పంపించింది. ఈ స్క్రాపింగ్ పథకంతో మరో 75 కోట్లు అర్హత సాధించబడింది.
Also Read: Naga Chaitanya : తండేల్ సక్సెస్ మీట్ ప్లేస్ ఫిక్స్ చేసిన నాగచైతన్య
అలాగే, తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని పని చేయడం ద్వారా 31.5 కోట్లు అర్హత సాధించింది. ప్రాధాన్యత లేని 20 జిల్లాల కోసం 20 కోట్లు పొందగా, మొత్తం 50.5 కోట్లు ప్రోత్సాహక సహాయం అందుతుంది. ఈ ఆర్థిక సహాయం రాష్ట్రం కోసం రవాణా రంగంలో మరింత అభివృద్ధికి దోహదపడనుంది.