MP K.Laxman : కరోనా లాంటి గడ్డు పరిస్థితి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారన్నారు. ఇదొక మైల్ స్టోన్ అని, దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆర్థికంగా ఎంత బలోపేతంగా దేశం ఉందనేందుకు ఇదే నిదర్శనమని, మధ్య తరగతి ప్రజలతో దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని భావించి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, సామాన్యుడు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారన్నారు ఎంపీ కె.లక్ష్మణ్.
Annamaya District: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్..
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని 29 శాతం నుంచి 11 శాతానికి తగ్గించారని, ఇవన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కనిపించడం లేదన్నారు. కళ్లు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ కు కంచుకోటలాగా మెదక్ ను చెప్పుకున్నారు.. కానీ అన్ని ఏండ్లు అధికారంలో ఉన్నా రైలు మార్గం వేయలేదని, కానీ మేము చేపట్టాం.. త్వరలో రైలు ప్రారంభమవుతుందన్నారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. మా హయాంలో పదేండ్లలో మేమేం చేశాము.. మీరేం చేశారు అనే అంశంపై చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు అడిగినా అడగకున్నా.. తెలంగాణకు నిధులు వస్తాయన్నారు.
Abhishek Sharma:అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ