Telangana Congress జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ముందుగా మొదలయ్యేది తలనొప్పులే. కాంగ్రెస్ను గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 3 భాగాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నగరంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మూడు ముక్కలు చేయాల్సిందేనని పార్టీ గట్టిగా భావించి అడుగులు…
Telangana Congress Politics టీ కాంగ్రెస్లో గాలి దుమారం… ఇద్దరు సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా? పదవి విషయంలో వచ్చిన పొరపచ్చాలు.. పంతాలు అగ్గి రాజేస్తున్నాయా?. ఇంతకీ ఏంటా వైరం? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..! నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తెలంగాణ కాంగ్రెస్లో కామన్. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది లేదు. భేదాభిప్రాయాలతోనే సమస్య. పార్టీలో ఇదే ఇప్పుడు తలనొప్పి. పీసీసీ చీఫ్ రేవంత్కి సన్నిహితంగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర…
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తాము కేసీ వేణుగోపాల్తో చర్చించామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో.. మోదీ పర్యటన ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని…
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని.. వారి కుట్రను ప్రతిఒక్కరూ గమనించాలని టీపీసీసీ ప్రచారకర్త కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతోన్న బీజేపీ.. ఆయన్ను జైలుకు ఎందుకు పంపడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రతిపక్షాల తరఫున కేంద్రం వద్ద మాట్లాడలేదని అన్నారు. 8 ఏళ్లుగా పార్లమెంట్లో ప్రధానిని ఏనాడూ కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం కాల్పులు జరుపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ పట్ల కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పిన…
కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ బేధాలు పూర్తిగా తొలగిపోయాయని సీనియర్ నేత వీ హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు అప్పట్లో స్వర్గీయ పీజేఆర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, ఆయన కొడుకుగా విష్ణు వర్ధన్ పార్టీని వీడే ప్రసక్తే లేదని వెల్లడించారు. చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే విష్ణు కొనసాగుతాడని అన్నారు. విష్ణు…
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. అయితే.. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్ఎస్తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇక పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. అయితే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు.…
గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదంటూ.. జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సటైర్ వేశారు. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చి.. మళ్లీ నేను సన్యాసిని అంటారు మోడీ అంటూ విమర్శించారు. బీజేపీ తెలంగాణ మీద దృష్టి పెట్టిందని మండిపడ్డారు. హిట్లర్ ఎలాగైతే మంచిమాటలు చెప్పి. గెలిచి దేశాన్ని ఆక్రమించినట్టు ఉంది బీజేపీ వ్యవహారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తక్కువ సీట్లు గెలిచిన చోట కూడా అధికారం కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అయిపోయింది..…