MLA Seethakka Fired on Komatireddy Rajgopal Reddy
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. ఎప్పటినుంచో అసమ్మతితో ఉన్న ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌ను వీడుతున్నారు. అయితే నేడు మునుగోడులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏ తల్లి ఆశీర్వదిస్తే గెలిచిండో… ఆ తల్లి కష్టాల్లో ఉంటే అమిత్ షా దగ్గర ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ ఆమె ఆరోపించారు. బేరసారాలు ఆడుకుంటున్నాడని, తల్లి గుండె పై తన్ని పోతున్నాడు రాజగోపాల్‌రెడ్డి అంటూ ఆమె మండిపడ్డారు. సొంత పనుల కోసం బీజేపీ లో చేరుతున్నడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎలా చెడ్డ పార్టీ అవుతుంది అనేది ఆలోచన చేయాలి ప్రజలు. ఇతర పార్టీ ఎమ్మెల్యే లను కొనుక్కోవడం.. ధరలు పెంచడం…ప్రభుత్వాలు కుల్చడమే బీజేపీ పని. తల్లి పాలకు తప్పా..అన్నిటికీ పన్నులు విధించింది బీజేపీ. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారు అని విమర్శించిన బీజేపీ నీ నిలదీయండి.
టీఆర్ఎస్..బీజేపీ వచ్చాక..అమ్ముడు..కొనుడు ..దాచుకునుడు. జైల్ కి పోయి వచ్చిన వాడి దగ్గర పని చేయాలా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. అమిత్ షా హత్య కేసులో జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి పక్కన ఎట్లా కుర్చుంటున్నవు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. 2018 లో పోటీ చేసిన నాయకుడికి టికెట్ ఇవ్వాలి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోగానే టికెట్ కావాలి..పదవి కావాలి. కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్లకు మాత్రం పదవులు వద్దట. రాహుల్ సభకే రాలేదు… కానీ రాహుల్ గాంధీ అంటే అభిమానం అంటాడు. సంపాదన కి టీఆర్‌ఎస్.. కాపాడుకోవడం కోసం బీజేపీ. పేదల కోసం కాంగ్రెస్ అంటూ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు.