Revanth Reddy Fired on Komatireddy Rajgopal Reddy
తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమాజం నిశీతంగా పరిశీలిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధాంతాల ముసుగులో అరాచకాలు బీజేపీ చూపెడుతోందన్నారు. పార్లమెంట్ శాసన విధానాలనే కించ పరుస్తూ వ్యవహరిస్తున్నారని, నరేంద్ర మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణా కోసం కొట్లాడినం అని చెప్పుకునే ముసుగు వీరులు.. తమ ఆర్ధిక అవసరాల కోసం మోడీ, అమిత్ షాలు వేసిన ఎంగిలి మెతుకుల కోసం పాకులాడుతున్నారన్నారు. తెలంగాణ తల్లి సోనియాగాంధీ ఇచ్చిన మాటకు నిలబడి, ఆంధ్రలో పార్టీ ఓడినా.. రాష్ట్రం ఇచ్చింది రాజకీయ కక్ష్యలతో సోనియాను అవమానిస్తున్న పరిస్థితుల్లో, అమిత్ షా తో కాంట్రాక్టు లు చేసుకున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. పోరాటం చేయాల్సింది పోయి కుక్క బిస్కట్ల కోసం మోడీ, అమిత్ షా పంచన చేరారని, కాంగ్రెస్ తో ఉన్న పేగు బంధం తెగిపోయిందన్నారు.
మునుగొడులో కాంగ్రెస్ ను గెలిపించారని, ఆర్ధిక బంధాల కోసమే, తల్లి లాంటి కాంగ్రెస్ ను అవమానించారన్నారు. గతంలో లాగా వ్యవహారాలు ఉండవన్న రేవంత్ రెడ్డి.. పార్టీకి నష్టం కలిగిస్తే ఉరుకోమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం కమిటీ వేయనుంది ఏఐసీసీ అని, 5న మునుగొడులో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపుల, ఆర్ధిక లావాదేవీలకు పులి స్టాప్ పెడతామని, తొమ్మిది గంటల పాటు కొనసాగిన విచారణ సాగిందని, కోమటిరెడ్డి కుటుంబానికి అన్ని హోదాలు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వల్ల వాళ్లకు బ్రాండ్ పెరిగిందని, ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారన్నారు.