NTV Special Story T.Congress : “చేతి”ని ఎందుకు వదులుతున్నారో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Special Story on Telangana Congress.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నేతలు కమలం పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పటంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌ని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతకు ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి దాదాపు రాజీనామా చేశారు. ఐతే, సీనియర్ల బుజ్జగింపుతో ప్రస్తుతం ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పార్టీ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలమైన పార్టీ. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పటికీ అధికారంలో రాగల సత్తా ఉన్న కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నారనేది ప్రశ్న. పోనీ, కాంగ్రెస్‌ను వీడి అధికార టీఆర్‌ఎస్ లోకి వెళితే స్వప్రయోజనాల కోసం అనుకోవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో నామ మాత్రంగా ఉన్న బీజేపీలోకి ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటూ పార్టీ బలంతో కాకుండా తమ స్వంత బలంతో గెలుస్తామనే ధీమా కావచ్చు. అలా ఎంతమంది సొంత బలంతో ఎమ్మెల్యేలుగా గెలుస్తారో తెలియదు.
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
వాస్తవానికి తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ జనంలోకి ఎలా దూసుకు వెళ్లిందో… తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను అంతే బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. దీనికి తోడు గత ఎన్నికల్లో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఫిరాయింపులు పోగా మిగిలింది ఆరుగురు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటే ఇటు అసెంబ్లీలో.. అటు రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని బహుశా కేసీఆర్ అనుకుని ఉంటారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తుందని ఆయన ఊహించి ఉండరు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే తనకు ఇక ఎదురు ఉండదనే అనే అంచనాలు పూర్తిగా తప్పాయి. ఊహించని విధంగా బీజేపీ ఎదుగుతోంది.
ఇక మళ్లీ కాంగ్రెస్ విషయానికొస్తే.. మొదటి నుంచి ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు..అసమ్మతి..అంతర్యుద్ధానికి పెట్టింది పేరు. సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన జూనియర్ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఇంటిపోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా మునపటిలా బలంగా లేకపోవటంతో ఒకరు చెబితే వినే పరిస్థితిలో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు లేరు. దాంతో నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితికి దిగజారటానికి ఇంటిపోరే ప్రధాన కారణం.
ఇక ప్రస్తుతం కోమటిరెడ్డి ఎపిసోడ్‌తోనే తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా దాసోజు శ్రవణ్ రాజీనామా విస్మయానికి గురి చేసింది. రేవంత్ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్‌గానే తమ అసంతృప్తి వెలిబుచ్చారు. కలిసివస్తే మద్దతిస్తామని.. ఒంటెద్దు పోకడలుపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని చెప్పారు. కానీ, దాసోజు ఎప్పుడూ ఏ విషయంలోనూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానీ.. పార్టీ పట్ల తన అసంతృప్తిని గానీ వ్యక్తం చేయలేదు. అయితే ఇటీవల దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం పట్ల అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే ఈ రాజీనామా పర్వాలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా వలసలు వెళ్తుంటే.. ఏం చేయాలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం పాలుపోవడం లేదు. ఇదిలానే కొనసాగితే.. తెలంగాణలో త్రిముఖపోరు కాస్త.. ద్విముఖ పోరుగా మారే అవకాశం ఉంది. గతంలో.. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి చేరిన నేతలు సైతం.. ఇప్పడు టీఆర్‌ఎస్ ని వీడుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ.. చివరికి అందరూ బీజేపీలోకి చేరితే 2024 ఎన్నికల్లో ప్రధాన పోరు టీఆర్‌ఎస్-బీజేపీ మధ్యేననేది స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!