Komatireddy Rajgopal Reddy : అందుకే పార్టీ వీడుతున్నా.. సోనియాగాంధీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Komatireddy Rajgopal Reddy Letter to Sonia Gandhi.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరమవడం పెద్ద దెబ్బేనని చెప్పాలని.అయితే ఇటీవల రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పించేందుకు ఈ నెల8న స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు రాజగోపాల్ రెడ్డి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేక రాశారు రాజగోపాల్ రెడ్డి. ఆ లేఖలో పార్టీనీ ఎందుకు వీడుతున్నారో వివరించారు. సోనియా గాంధీకి రాసిని లేఖలో ‘ ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేదు.
తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్ఎల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగామరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎం.ఎల్.ఏ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!