వి.హనుమంతరావు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోకపోయినా వీహెచ్ మాత్రం వెంటనే స్పందిస్తారు. మొహమాటం లేకుండా కొబ్బరి కాయ కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో బాగా సందడి చేశారు. కోలాటం ఆడి అటు కాంగ్రెస్ కార్యకర్తల్ని, ప్రజల్ని అలరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో సీఎల్పీనేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఈ పాదయాత్రలో వీహెచ్ పాల్గొన్నారు. కార్యకర్తలను తన…
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి…
పార్టీ ఒకటే కానీ నేతలు వేరయ్యారు. విడిపోయారు. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువైన కాంగ్రెస్ పార్టీలు ఆందోళనల్లోనూ ఎవరి ధోరణిలో వారు ముందుకెళుతున్నారు. సంగారెడ్డీ జిల్లా కేంద్రంలో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్ ధరలు తగ్గించాలని పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ధర్నాతో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ వర్గం, జగ్గారెడ్డి వర్గం వేర్వేరు చోట్ల ధర్నాలు నిర్వహించారు. సంగారెడ్డి…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.
Conflicts Between Telangana Congress Leaders. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. అగ్రనేతలే కాకుండా మధ్యతరగతి నేతల్లో కూడా ఆదిపత్య పోరు సాగుతోంది. తాజాగా హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగా హనుమకొండలో పాగా వేసేందుకు కొంతమంది కోవార్టులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.…
Bhongir MP Komatireddy Venkat Reddy about Telangana Congress తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. అయితే టీకాంగ్రెస్ పోరు ఇప్పుడు బయట పడడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న కొట్లాటలుంటాయని, అన్నీ సర్దుకుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తి లేదని, నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు…
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్‌తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు.…
తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్‌తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి పోస్ట్ చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్-సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జగ్గారెడ్డి కి బుజ్జగింపులు పర్వం మొదలైంది. పార్టీలో తనని కోవర్ట్ అంటున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి…