జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. ఆర్జేడీ నేతతో మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్జేడీ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ ఉన్నారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. కాలం కలిసివస్తే తేజస్వీ యాదవ్ సీఎం అయ్యుండేవారు.
Also Read
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!