Konda Surekha : తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం ఉదయం కీలక సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అప్పటికే మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. వెంటనే అక్కడే హుటాహుటిన అక్కడకు చేరిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించింది.
2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!
మెడికల్ పరీక్షల అనంతరం వైద్యులు మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రకటించారు. లో బీపీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు డాక్టర్లు తెలిపారు. తక్షణమే ఇంజెక్షన్ ఇచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. కేబినెట్ సమావేశానికి హాజరై ఉన్న సమయంలో ఈ తాత్కాలిక అస్వస్థత కలిగినప్పటికీ, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి సురేఖకు తిరిగి పూర్తిస్థాయి విశ్రాంతి కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Toxins : బాడీలోని టాక్సిన్స్‌ని బయటకుపంపే 7 అద్భుతమైన కషాయాలు..