గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని…
తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ షరతులు విధించింది.
ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
New Ration Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరు హామీ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామని.. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్.. ఏబీసీలకు కార్పొరేషన్ వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రేపోమాపో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశముంది.
తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.