తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. రేపు (ఆదివారం) ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Migration to BJP: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయి. అన్ని పార్టీల అసంతృప్త నేతలు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు.
MLA Raja singh: బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేసినందుకు పార్టీ నాయకత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. కర్ణాటక ప్రభావం.. తెలంగాణలో కచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రధాన రాజకీయ పార్టీల్లో బలంగా ఉంది. అందుకే అక్కడ గెలిచిన వారికి ఇక్కడ మోరల్ బూస్ట్ దొరుకుతుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఐదునెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టేట్ ఇప్పటికే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కర్ణాటక…
Bandi sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని స్పష్టమైనప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
బీజేపీలో బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇవాల ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కషాయి కండువా కప్పుకున్నారు. ఇవాల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో బీజేపీ చేరారు.