Bandi Sanjay: వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్లు.. బండి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భీమేశ్వర గార్డెన్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. బెంగాల్ లాగా బీఅర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ సగం మందికి టికెట్స్ రావని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని ఎద్దేవ చేశారు. 30 శాతం కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబం, అవినీతి కుటుంబం అని బండి తెలిపారు. మళ్ళీ ఎన్నికలు రాగానే అమలు కాని హామీలు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఎలా కోటీశ్వరులు అయ్యారు? ఏం బిజినెస్ చేశారు? అంటూ ప్రశ్నించారు. వైన్స్ షాప్ దంధాలు చేయడానికి, కేసీఆర్ కుటుంబం, అధికారులు ప్లీజ్ టెండర్ వేయండి అంటూ మార్కెటింగ్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Slum Dog Husband : ఓటీటీ లో ట్రెండింగ్ గా నిలిచిన ఫన్ టాస్టిక్ మూవీ..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
చంద్రయాన్ 3 సక్సస్ అయింది..అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అక్కడ ఎలాంటి దందా చేయవచ్చు, అని ఆలోచన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దందా నెక్స్ట్ చంద్ర మండలం పై చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తుండు కేసీఆర్ అని మండిపడ్డారు. గవర్నర్ కి భయపడే సీఎం సయోధ్యకి వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు ఆమోదం కోసమే గవర్నర్ తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి ఆరోపించారు. నేను సీఎం కావాలని అనుకోవటం లేదు, అనుకునే వాళ్ళు మూర్ఖులు అని అన్నారు. ముందు రాక్షన ప్రభుత్వంను తొక్కాలని అన్నారు. బండి సంజయ్ ఎక్కడి నుండి పోటీ చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుంది అని అన్నారు. సర్వేలు ఆధారంగా టికెట్ ఇస్తారు.. బీజేపీలో లాబియింగ్ ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారని బండి సంజయ్ తెలిపారు. ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లిం వారికి ఏం చేసింది? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓవైసి పోటు గాడు చార్మినార్ కే పరిమితమన్నారు. దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటు అని అన్నారు.
Florida Woman: ప్లీస్ హెల్ప్ అంటూ పిజ్జా ఆర్డర్.. రంగంలోకి పోలీసులు.. కథ అంతా బాయ్ ఫ్రెండ్ చుట్టూ.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..