BJP Metting: తెలంగాణ నేతలతో బన్సాల్ భేటీ.. రెండు రోజుల సమావేశాల్లో 100 రోజుల కార్యాచరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Metting: తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ అగ్రనేత సునీల్ బన్సాల్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ మూడు రోజులుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సునీల్ బన్సాల్ ఇవాళ కూడా బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత సునీల్ బన్సాల్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో పార్టీ ఉంది. అయితే ఇటీవలి కాలంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై ఆ పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పార్టీ నేతలతో సునీల్ బన్సల్ వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ నెల 9వ తేదీన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో ఆ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 11 రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జేపీ నడ్డా, సునీల్ బన్సాల్ ఈ నెల 9 సాయంత్రం తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్తుపై నేతలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు సమన్వయంతో పని చేయాలని నడ్డా సూచించారు. జేపీ నడ్డాతో భేటీ అనంతరం బీజేపీ నేత సునీల్ బన్సాల్ కూడా తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో సునీల్ బన్సాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
Also Read
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో సునీల్ బన్సాల్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. దరిమిలా సునీల్ బన్సాల్‌ను పార్టీ అధిష్టానం నియమించిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ పరిణామం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెలలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీ అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బన్సల్ రంగంలోకి దిగారు. రెండు రోజుల సమావేశాల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బీజేపీ ప్రచారంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లాలని సునీల్ బన్సాల్ పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను, బీజేపీ నేతలను కూడా కలవనున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతల బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. బీజేపీ నాయకత్వం ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టనుంది.
Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?