Kishan Reddy: కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను తప్పించి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల వేళ ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ పై దూకుడు ప్రదర్శించే బండి సంజయ్ ను తొలగించి సౌమ్యుడిగా పేరొందిన కిషన్ రెడ్డిని నియమించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చర్చ జరుగుతోంది. అయితే విదేశీ పర్యటనలు, వివిధ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ కారణంగా కిషన్ రెడ్డి ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టలేదు. అయితే ఇవాళ కిషన్ రెడ్డి నేతల సమక్షంలో అధికారికంగా రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం 12.15 గంటలకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌లు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు.
Read also: Railway Luggage Rules: రైలులో లగేజీ తీసుకెళ్లే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించండి.. రూల్స్ మారాయి?
ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8.20 గంటలకు అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. బషీర్‌బాగ్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో ఉదయం 8.50 గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9.20 గంటలకు లిబర్టీ అంబేద్కర్ విగ్రహానికి, 9.40 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గన్‌పార్క్ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఉదయం 11.45 గంటలకు కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారు. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కార్యకర్తల సందడితో బీజేపీ కార్యాలయం సందడిగా మారనుంది. బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
WI vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్!