తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షులు, కరీంనగర్ MP బండి సంజయ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ నేడు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దఅంబర్ పేటలో జరగనున్న ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతికి బీజేపీలో మంచిపేరు…
గవర్నర్ తమిళిపై వాస్తవాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. గవర్నర్ వ్యవస్థను టీఆర్‌ఎస్ కించపరుస్తోందని ఆరోపించారు. ఆమెపై బీజేపీ ముద్ర వేసి అవమానిస్తున్నారని చెప్పారు. కల్వకుంట్ల రాజ్యాంగం బ్యాచ్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని మండిపడ్డారు మంచి పడ్డారు. టీఆర్‌ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించడం గానీ చేయడం లేదని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అని ఎద్దేవ చేశారు. గౌరవనీయులైన…