ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ స్త్రీల పట్ల కవిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అమాటలను వెనక్కి తీసుకోవాలని ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య డిమాండ్ చేశారు.
పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంది.
OFF The Record: ఆయన బీజేపీలో కీలక నేత. ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తన వాగ్ధాటితో ఎదుటివారిని కట్టడి చేసే ఆయనకు.. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. అసమ్మతి పేరుతో నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు వేడి రాజేస్తున్నాయి. అదెక్కడో.. ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. దుబ్బాక బీజేపీలోని సీనియర్లు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? కాషాయ శిబిరంలో ఎందుకు కలకలం? ప్రస్తుతం టీ బీజేపీలో…
OFF The Record: తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని కమలంపార్టీ గట్టిగా చెప్పుకొంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఢంకా బజాయిస్తున్నారు నేతలు. మరి.. క్షేత్రస్థాయిలో బీజేపీకి ఆమేరకు బలం.. బలగం ఉందా? అది తెలుసుకోవడానికే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఆ భేటీ తర్వాత క్లారిటీ వచ్చేస్తుందా? ఇంతకీ ఏంటా సమావేశం? తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్ బూత్ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్ కమిటీలు ఎంత…
బీజేపీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శులది కీలక పాత్ర. ఈ పదవిని RSS నుంచి వచ్చే ప్రచారక్లకు అప్పగిస్తారు. అలా రాష్ట్రానికి ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ.. తెలంగాణలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి లేరు. ఏడాదిలో ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో కీలక కుర్చీని బీజేపీ ఖాళీగా ఉంచింది. ఎందుకలా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శులది కీలక బాధ్యత ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే బీజేపీ సంస్థాగత నిర్మాణం వేరే విధంగా ఉంటుంది.…
తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది.
jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి…