పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సోషల్ మీడియా, లీగల్ సెల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు.
‘పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం, టైమ్ కూడా ఇవ్వం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్స్ ద్వారా బీజేపీపై పోస్టులు పెడుతున్నాయి. పార్టీ నేతలు ఒక మంత్రి దగ్గరకు వెళితే.. పిర్యాదు చేసేందుకు వెళ్లారని రాశారు. ఆ పేపర్ మీద రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాం. మేము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్‌లు పెడుతున్నారు. కేసులు పెట్టీ జైలుకు పంపిస్తాం. ఇప్పటికే కేసులు పెట్టాం. పార్టీ మీద ఎవరు పోస్టులు చేసినా కౌంటర్ ఇవ్వండి. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదు. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి’ అని రామచందర్ రావు అన్నారు.
Also Read: Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల పోలీస్ కస్టడీ.. ఇక డబిడదిబిడే!
‘డబ్బులిస్తే ఏది పడితే అది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు. యూట్యూబ్‌లో మాట్లాడుతున్నారు. ఒకరు దుబాయ్, మరొకరు అమెరికాలో ఉండి తిడుతున్నారు. మీరు ఇండియాకు రండి మీ సంగతి చెబుతాం. పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరిని ప్రోత్సహించినా, వాటిని ఫార్వర్డ్ చేసినా సిరియస్ యాక్షన్ ఉంటుంది. నా మీద కూడా ఫేక్ వార్తలు వస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. మీ వ్యక్తిత్వంను చంపుకోవద్దు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కోరారు.