BRS Manifesto Live updates:తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
CM KCR: పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా పంటల సాగులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నామన్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశాం.
CM KCR: క్యాడర్ లో అసంతృప్తి లేకుండా చేయాలని, అవసరమైతే పార్టీ కార్యకర్తలు టీవీ ఛానల్ ను నడపాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు.
KTR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.
ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్‌ఎస్ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రజాప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించే బీఆర్‌ఎస్ ఈ ఏడాది సాధారణ సమావేశానికే పరిమితం చేయాలని నిర్ణయించింది.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.