CM KCR: క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించండి.. అవసరమైతే టీవీ ఛానల్ ను నడపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: క్యాడర్ లో అసంతృప్తి లేకుండా చేయాలని, అవసరమైతే పార్టీ కార్యకర్తలు టీవీ ఛానల్ ను నడపాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు. షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే ఇబ్బంది.. నేను చేయడానికి ఏమి ఉండదని తెలిపారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేసినామని తెలిపారు. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామన్నారు సీఎం. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని పిలుపు నిచ్చారు.
మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామని భరోసా ఇచ్చారు. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తమన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందన్నారు. దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతం వుందని అన్నారు. కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని గుర్తు చేశారు. వాటి సర్వే నెంబర్ లు వేసి నా ఆఫిసులో ఇవ్వాలని కోరారు. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దామన్నారు. మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయన్నారు. ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని, ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
Read also: Girls things: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తారో తెలుసా?
ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయని తెలిపారు. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చన్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గం. 12.45 కల్లా అక్కడికి చేరుకొవాలని సూచించారు. 1.58 గంటల నుంచి 2.04 గంటల వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు వెళ్లాలని సూచించారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్, లంచ్, తర్వాత డిస్పోస్ అని తెలిపారు. మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించిందన్నారు. 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించిందని తెలిపారు. సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించిందని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేసానన్నారు.
తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటుందని తెలిపారు. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు ? అని ప్రశ్నించారు. 2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నామన్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని కోరారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందన్నారు.
Read also: Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమన్నారు. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్ అన్నారు సీఎం కేసీఆర్. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదన్నారు. తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చని అన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ ను కూడా నడపవచ్చని సూచించారు.
KTR: బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ.. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!