మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు.
Read Also: BJP: పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించిన బీజేపీ..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్.. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. యూసఫ్ గూడాలో నిర్వహించిన జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై కేటీఆర్ చర్చించారు.
Read Also: Hanuman: ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు.. ఎందుకంటే?
అయితే ఈ సమీక్ష ముగిసిన తరువాత కేటీఆర్.. యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లారు. రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటోవాలాల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం ఆటోవాలాలు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆటోవాలాలకు అండగా నేనున్నానంటూ మరోసారి గుర్తు చేస్తూ.. ఆటోలో ప్రయాణం చేసి ఆటోవాలాలకు మద్ధతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తర్వాత ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ విమర్శించారు.