సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
MLC Jeevan reddy: ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం ముగిసింది.
BRS Meeting: నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
KCR: త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో... అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు.
Kaushik Reddy: మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదని కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.