Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌పై సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు సహా మొత్తం 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read also: Love failure: దేశంకోసం పోరాడే జవాన్ ప్రేమలో ఓడాడు.. ప్రాణాలు వదిలాడు
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సుమారు 6 వేల మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి దర్శన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించినా సాధారణ సభకే పరిమితమైంది. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా శాఖల అధ్యక్షులతో పాటు మొత్తం 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించినా సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండాను రూపొందించారు.
5G offers: ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు