దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో డాక్టర్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము అభినందిస్తున్నాం. భారతదేశానికి గౌరవప్రదంగా…
Harish Vs Ponnam: దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని హరీష్ రావు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.
TG Assembly Sessions: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడవ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేశారు. Kandula Durgesh: కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం..…
ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.
హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేశారు. అయితే ఇవాళ శాసనసభ “భూ భారతి” బిల్లుపై చర్చతో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతు బీమా పాలసీలపై లఘు చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో రైతు బీమా పాలసీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Harish Rao Vs Speaker: ఫార్ములా-ఇ కార్ రేస్ అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. ఈరోజు అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా..