Minister Singireddy Niranjan Reddy: దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి పథకాలపై అధ్యయనం చేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యవసాయాన్ని అందరి ఆశీస్సులతో దేశంలో ముందు వరుసలో నిలబెట్టామన్నారు. ఖిల్లా ఘనపురం మండల కేంద్రంతో పాటు వెనక్కి తండా, ముందరి తండా, కర్నె తండా, ఆముదం బండ తండా, షాపూర్, మానాజిపేట, మల్కాపూర్, దొంతికుంట తండా, రుక్కనపల్లి తండా, కోతులకుంట తండా, జగ్గయిపల్లి, సూరాయి పల్లి, ఉప్పరిపల్లి, సోలిపూర్ గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి వెంట ఎంపీపీ కృష్ణ నాయక్, నాయకుడు నాగం తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల తండాల సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: KTR: రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతాడు
ఆ రోజులలో కరెంట్ కష్టాలు, వ్యవసాయ బాధలు, వలసలు, పింఛన్ కోసం ఎదురుచూసే పరిస్థితులప ఒకసారి గుర్తుచేసుకుంటే తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎంత మార్పు వచ్చిందో అర్థం అవుతుందన్నారు. చెప్పే మాటలో సత్యం, ధర్మం ఉంటే తనకు ఓటు వేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరిగింది కాబట్టి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగినందుకు గాను రైతుబంధు దశలవారీగా రూ.16 వేలకు పెంచుతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మండల కేంద్రాలలో నిర్మిస్తున్నామన్నారు. పొలం ఉన్న వాళ్లకు రైతు బీమా ఇస్తున్నారని .. భూమి లేని వారి పరిస్థితి ఆలోచించి సీఎం కేసీఆర్ ముందు చూపుతో వారందరికీ కేసీఆర్ భీమాను అమలుచేయనున్నామని హామీ ఇచ్చారు.
Also Read: Priyanka Gandhi: రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
గ్యాస్ ధర పది సంవత్సరాల నుండి పెరుగుతూనే ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీ భరించి గ్యాస్ సిలిండర్ రూ.400 లకే ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఆనాడు కరెంట్, సాగునీళ్లు, అన్ని రకాల వసతులు కల్పించి ఉండి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుండే .. అంత మంది అమరవీరులు ఆత్మ బలిదానాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది .. ఒకసారి అలోచించాలన్నారు. గృహలక్ష్మి పథకంను అర్హులైన వారందరికీ అమలు చేస్తామన్నారు. 2014 కన్నా ముందు 10 ఏండ్లు కాంగ్రెస్ పాలనే .. ఆనాటి కాంగ్రెస్ హయాంలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు .. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో 1లక్ష 62 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి చెప్పారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..” పారిశ్రామిక రంగంలో 16 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చాయి. నిజాలు చెప్పకుండా అబద్దాలను ప్రజలకు చెబుతూ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న జిల్లాలు అయితే ప్రజలకు మంచి పరిపాలన అందుతుందని చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. 46 జీవో ప్రకారంగా ప్రస్తుతం తాత్కాలికంగా ఇబ్బంది అయిన భవిష్యత్తు లో మంచి జరుగుతుంది. ఏదయినా ఒట్టిగా రాదు కష్టపడితే వస్తుంది… పింఛన్, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతుభీమా, ప్రతి ఇంటికి మంచి నీళ్లు, రోడ్లు, ఇలాంటివి కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతున్నారు. సాగునీళ్లు రావడం మూలంగా పంట పొలాలలో జోరుగా వ్యవసాయం పెరిగింది .. అందుకే భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. 40 ఏండ్ల నుండి చిన్నారెడ్డి కాంగ్రెస్‌ను పట్టుకుని ఉన్నాడు .. కాంగ్రెస్ అంటే చిన్నారెడ్డి .. చిన్నారెడ్డి అంటే కాంగ్రెస్ అనే విధంగా ఉన్నది.. ఢిల్లీకి పోయి సూటుకేసులు ఇస్తే చిన్నారెడ్డిని కాదని వేరే వాళ్లకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు .. ఇలాంటి వాళ్లు భవిష్యత్తులో 5 ఏండ్లు చేస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలి. వనపర్తిని జిల్లా చేసి ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకుని వచ్చాను.” అని మంత్రి తెలిపారు.