Bhatti Vikramarka: కాంగ్రెస్‌దే అధికారం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో మరిన్ని కీలకాంశాలు ఉండబోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఆదాయం పెంపు.. పెరిగిన సంపద ద్వారా పేదలకు సంక్షేమం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి దిశగా ప్రణాళికలు రచించేది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండడం వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టులు.. పవర్ ప్రాజెక్టులు నిర్మించామన్నారు. తెలంగాణలో పారే నీళ్లు.. వచ్చే వెలుగులన్నీ మేం కట్టిన ప్రాజెక్టుల వల్లే జరుగుతోందన్నారు. కేసీఆర్ వచ్చాక కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి వంటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులను మాత్రమే టేకప్ చేశారన్నారు.
Also Read: BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
కాళేశ్వరం కుంగిపోయింది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్లే లేవన్నారు. యాదాద్రి, భద్రాద్రి వంటి పవర్ ప్రాజెక్టులని టేకప్ చేస్తే.. భద్రాద్రి మాత్రం ట్రయల్ రన్ నడుస్తోందన్నారు. అందుకే తెలంగాణలో పారే నీళ్లు.. వెలిగే వెలుగులన్నీ కాంగ్రెస్ చొరవ వల్లే జరిగిందన్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. తానే చేశానని కేసీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూలీ పనులకెళ్లే దుస్థితిలోకి కేసీఆర్ రాష్ట్రాన్ని నెట్టారని తీవ్రంగా మండిపడ్డారు భట్టి విక్రమార్క. బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్లు కూలీ పనులకెళ్లడం తెలంగాణ సమాజానికే అవమానమన్నారు.
Also Read: BJP Manifesto: ఎల్లుండి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే ఛాన్స్
కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది.. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో ఇచ్చాం.. కానీ కేసీఆర్ రూ. 5 లక్షల అప్పులు తెచ్చారన్నారు. సంపదను కొద్ది ఫ్యూడల్సుకు పంచాలనేది కేసీఆర్ ఆలోచన అని ఆయన ఆరోపించారు. ఆస్తుల కల్పన.. సంపద సృష్టి దిశగా కేసీఆర్ ఆలోచనే లేదన్నారు. మధిరలో అగ్రో బేస్డ్ కంపెనీలు తెస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అమూల్ తరహాలో పాడి రైతుల కోసం మహిళా సమాఖ్యల నేతృత్వంలో ప్రాజెక్టు మధిరకు తెస్తామన్నారు.
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!