Minister KTR: కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు సంచులతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సబ్బండ వర్గాలకు ధీమా అని మంత్రి చెప్పారు.
Also Read: Kaleru Venkatesh: ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు..
బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చి కాపీకొట్టి మేనిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతా అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డబ్బు మదంతో కాంగ్రెస్ సీనియర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యతలేని కరెంటు, కాలిపోయే మోటర్లు, ఎరువుల కొరత, విత్తనాల కొరత తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలే మాకు ధైర్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరు ఉండాలి అనేది ఢిల్లీ పెద్దలు నిర్ణయించే దుస్థితి రావద్దన్నారు.