Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సుపరిపాలన అనేది అంతా వట్టిదే అని అన్నారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించాలని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ కోరారు.
ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్ని రోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ కుమార్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించబోతున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే ఛాన్స్ లేకపోలేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
జూన్ 4 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో జర్నలిస్టులతో తేజస్వీ మాట్లాడారు. బీజేపీతో నితీష్ సరిగా ఉండడం లేదని చెప్పారు.
Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.