Tejashwi Yadav: ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే.. దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు
- ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే
- ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
- దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ ఈ విధంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన నినాదం అని, కేవలం ఆ నినాదానికే కూటమి పరిమితమైందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తి వచ్చి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇది పెద్ద విషయమే కాదని వ్యాఖ్యానించారు. ఇక బీహార్‌లో కూడా అక్టోబర్ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కేవలం 70 సీట్లకే పరిమితం కాకుండా మొత్తం 243 సీట్లకు సిద్ధం కావాలని తేజస్వీ సూచించారు. దీంతో బీహార్‌లో కూడా పొత్తు ఉండదేమోనని సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
తేజస్వీ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తేజస్వీ వ్యాఖ్యలను బట్టి.. ఇండియా కూటమి లేదన్న సంగతి అర్థమవుతుందని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. బీహార్‌లో కూడా ఇండియా కూటమి అంతరించిపోయిందని సీఎల్పీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి భారత కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి విచ్ఛన్నం అవుతుందని జోష్యం చెప్పారు. మోడీ చెప్పినట్లుగానే నేటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌కు మిత్ర పక్షాలు సపోర్టు చేయలేదు. సింగిల్‌గానే లోక్‌సభలో పోరాటం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా కూటమి విడిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు మమతా బెనర్జీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సముఖంగా లేదు. ఇలా మొత్తంగా విభేదాలు తలెత్తాయి.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్-ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆప్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కొద్ది మంది పేర్లే వెల్లడించింది. ఇక బీజేపీ తొలి జాబితాలో 29 పేర్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!