Bihar: బీహార్ అరారియాలో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి దాడి చేయడం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగంపై కొందరు బాధితుడి చేతులు వెనకకు కట్టి, ప్యాంట్ విప్పి, అతడి ప్రైవేట్ పార్టులో కారం పోసి, కొట్టారు. అతడిని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సదర్ ఆసుపత్రి వెలుపల పార్క్ చేసిన షిఫాత్ బైక్ ఆదివారం చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షిఫాత్ బైక్‌తో సిమ్రాహా నివాసిని పట్టుకున్నాడు. షిఫాత్ మరియు అతని సహచరులు అనుమానిత దొంగను చేతులు కట్టేసి బహిరంగంగా శిక్షించారు.
Read Also: Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..
అయితే, ఈ ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీహార్‌లో ‘‘తాలిబాన్ రాజ్’’ నడుస్తుందని విమర్శించారు. “నేను మరియు నా పార్టీ దళితులు, వెనుకబడిన మరియు మైనారిటీల హక్కులు మరియు వాటా గురించి మాట్లాడుతాము, అందుకే కులవాదులు ఎల్లప్పుడూ మా పాలనను జంగిల్ రాజ్‌గా చూస్తారు” అని తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. అరారియాలో ఇస్లాంనగర్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరికొందర్ని కూడా గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు తెలిపారు.