PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తాజాగా బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఏర్పడగానే జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్) దీదీలను పర్మినెంట్ చేసి.. నెలకు రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు.
Story Board: బీహార్లో రెండు దశాబ్దాలుగా నితీష్ సీఎంగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ కాలం ఎన్డీఏ సర్కారే రాజ్యం చేసింది. గత పదేళ్లుగా ఓ పద్ధతి ప్రకారం పని చేస్తున్న తేజస్వి.. ఈసారి ఓటర్లకు ఫస్ట్ ఛాయిస్ గా మారారానే చర్చ మొన్నటిదాకా నడిచింది.
Bihar Elections 2025: ప్రస్తుతం దేశం చూపు బీహార్ వైపు ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. ఇటీవలే అధికార ఎన్డీఏ కూటమి పక్షాల సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష మహా కూటమి వంతు వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జెఎంఎం, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడింది. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా…
బీహార్లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.
Bihar Elections: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీహార్లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
Bihar Elections: బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు…