బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నో ఆశలు.. ఎన్నో ఊహలతో ఎన్నికల కథన రంగంలోకి దిగిన ఆర్జేడీ వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని.. ముఖ్యమంత్రి కావాలని తేజస్వి యాదవ్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు.
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
Nitish Kumar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇందులో 65 శాతం ఓటర్లు ఓటు వేశారు. నవంబర్ 11న జరిగిన రెండవ దశ పోలింగ్‌లో దాదాపు 69 శాతం ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా తేజస్వి యాదవ్ కల నెరవేరుతుందా అనే అంశంపై ఉత్కంఠ…
Bihar Assembly Election Results: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తం ఆసక్తి నెలకొంది. రేపు (నవంబర్ 14)న కౌంటిక్ జరగబోతోంది. బీహార్లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనా?, మహాఘట్‌బంధన్ కూటమా? అనేది రేపటితో తేలబోతోంది. అయితే, కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఎన్నికల అధికారుల్ని హెచ్చరించారు.
Bihar exit poll: బీహార్ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు తెలుస్తాయి. అయితే, ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ బీహార్లో మరోసారి బీజేపీ+జేడీయూల ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. తాజాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
BJP: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలుస్తుందని చెప్పాయి. మరోసారి, బీజేపీ+జేడీయూలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించాయి. ఆర్జేడీ+కాంగ్రెస్ల మహాఘటబంధన్ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతాయని అంచనా వేశాయి.
కుటుంబ సభ్యులతో కలిసి మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు వేశారు. బీహార్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 121 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తేజస్వి యాదవ్ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి పాట్నాలో ఓటు వేశారు.