Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Seat Sharing Disputes Erupt Within India Bloc

Story Board: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు

Published Date :October 22, 2025 , 8:59 am
By Chandra Shekhar Pamena
  • దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ రాజకీయం..
  • బీహార్లో ఎన్నికల ప్రచారానికి ముందే బ్లేమ్‌గేమ్‌..
  • ఇండియా కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు..
  • తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 143 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన..
Story Board: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: బీహార్లో రెండు దశాబ్దాలుగా నితీష్ సీఎంగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ కాలం ఎన్డీఏ సర్కారే రాజ్యం చేసింది. గత పదేళ్లుగా ఓ పద్ధతి ప్రకారం పని చేస్తున్న తేజస్వి.. ఈసారి ఓటర్లకు ఫస్ట్ ఛాయిస్ గా మారారానే చర్చ మొన్నటిదాకా నడిచింది. కానీ సీట్ల సర్దుబాటులోనే ఫెయిల్‌ కావటం ఇండియా కూటమికి.. ఆదిలోనే హంసపాదులా మారింది. కాంగ్రెస్ తో సర్దుబాటు చేసుకోలేని తేజస్వి.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని బీజేపీ దెప్పిపొడుపులు షురూ చేసింది.

Read Also: Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 26 మార్కులు వస్తే పాస్

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ రాజకీయం ఎన్నికలకు ముందే చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల ముందు ఎన్డీఏకి, రెండు వారాల ముందు ఇండియా కూటమికి వాతావరణం అనుకూలంగా ఉందనే అంచనాలు వచ్చాయి. వీటిలో నిజానిజాలపై చర్చ తేలకముందే.. మళ్లీ రాజకీయ చదరంగంలో ఆట మారిపోయింది. ఏ కూటమిలో ఎవరుంటారో తేలకముందు. తేలిపోయిన తర్వాత చేసిన సర్వేలకు.. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన మార్పుల తర్వాత వచ్చే ఫలితాలకు పొంతన ఉంటుందో.. లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తుందనుకున్న మహాకూటమిలో ఐక్యత.. సీట్ల సర్దుబాటు దగ్గరే ఆవిరి కావడం రాజకీయాన్ని సమూలంగా మార్చేసే పరిణామంగా చూస్తున్నారు.

Read Also: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు

బీహార్లో ఎన్నికల ప్రచారానికి ముందే బ్లేమ్‌గేమ్‌ మొదలైంది. రెండు కూటముల్లోనూ పొరపొచ్చాలున్నా.. ఇండియా కూటమి ఏకంగా సీట్ల సర్దుబాటు సమయంలోనే చేతులెత్తేయటం ఎన్డీఏకు అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఇండియా కూటమిలో అనైక్యతనే ఆయుధంగా చేసుకుని.. మరోసారి అధికారాన్ని గుప్పిటపట్టాలని ఎన్డీఏ ఎత్తులేస్తోంది. గతంలో హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ అనైక్యతతో దెబ్బతిన్న ఇండియా కూటమి.. మరోసారి బీహార్లోనూ సేమ్ సీన్‌ను రిపీట్ చేయటం.. ప్రతిపక్ష శిబిరంలో ఆందోళనను పెంచుతోంది. ప్రతిసారీ ఎన్డీఏకు చెక్ పెట్టే అవకాశం వస్తున్నా.. చేజేతులా జారవిడుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Read Also: Karthika Masam: నేడు కార్తీక మాసం ప్రారంభం.. గోదావరి నదికి పోటెత్తిన భక్తులు..

బీహార్‌లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితా విషయంలో పక్కాగా ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ 29 స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా చెరో ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే విపక్ష ఇండియా కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు నెలకొన్నాయి. పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఎవరికి వారే నామినేషన్లు వేసుకున్నారు. ఇప్పటికే తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ పలు స్థానాల్లో మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌తో కూడా పోటీ పడనుంది. ఈ రెండు పార్టీలకు సీట్ల సర్ధుబాటు విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. గత కొన్ని వారాలుగా ఇండియా కూటమిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఎంచుకోవడంలో విపక్ష పార్టీలు విఫలం అవుతున్నాయి.

Read Also: Astrology: అక్టోబర్‌ 22, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కంటే ముందే.. కలిసికట్టుగా ప్రారంభించిన ఇండియా కూటమి.. అసలైన సమయంలో పాత బలహీనతను బయటపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎప్పుడూ అంత త్వరగా ఏకాభిప్రాయం రాదు. కానీ నామినేషన్లు దగ్గరపడుతున్నా.. చివరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక కూడా ఇండియా కూటమి ఓ అండర్‌స్టాండింగ్‌కు రాలేకపోవడం పరిశీలకులకు కూడా షాకిచ్చింది. పార్టీల బలాబలాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ప్రస్తుతం మారుతున్న సమీకరణాల్ని బట్టి ఎక్కడైనా సీట్ల లెక్క తేలుతోంది. కానీ బీహార్లో మాత్రం ఈ ప్రాతిపదికలు దేనికీ ఇండియా కూటమి పక్షాలు ఒప్పుకోకపోవడంతో పాటు.. తెగేదాకా లాగి.. చివరకు ఎవరికి వారే యమునా తీరే అనే దుస్థితికి తెచ్చాయి.

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు జరగలేదని కాదు. ఇందుకోసం తేజస్వి ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఆ తర్వాత పట్నాలో తేజస్వి నివాసానికి వెళ్లి బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఇలా రెండు, మూడు దఫాలు సమావేశమైన తర్వాత కూడా.. ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు సీట్ల సర్దుబాటు ఎంతకూ తేలడం లేదనే కారణంతో.. తేజస్వి ఢిల్లీలో చర్చలు జరుపుతుండగానే.. లాలూ ప్రసాద్ పట్నాలో కొందరికి బీఫామ్‌లు ఇచ్చారు. ఈ సంగతిని కాంగ్రెస్ తేజస్వి దగ్గర ప్రస్తావించడంతో.. తేజస్వి హుటాహుటిన తండ్రికి ఫోన్ చేసి.. బీఫామ్ లు ఇవ్వొద్దని చెప్పారు. అప్పటికే కొందరికి బీఫామ్‌లు వెళ్లిపోవడంతో.. వారితో నామినేషన్ల ఉపసంహరణ చేయించాలనకున్నారు. కానీ కొందరు ఉపసంహరణకు ససేమిరా అనడం ఆర్జేడీకి తలబొప్పి కట్టించింది. ఈలోగా పట్నా వచ్చిన తేజస్వితో బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ బలానికి మించి సీట్ల బేరం పెట్టడంతో.. తేజస్వి కూడా విసిగిపోయారు. చివరకు ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఆర్జేడీ నేత తేజస్వి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. తొలివిడత పోలింగ్‌ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపుతోంది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే పెద్ద నిదర్శనం.

బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ఆర్జేడీ 145 సీట్లలో పోటీకి రెడీ అయింది. కాంగ్రెస్‌ 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో మిగతా పార్టీల్ని పక్కనపెట్టినా.. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు నెలలుగా కలిసికట్టుగా కనిపిస్తూ కూడా.. అసలు సమయంలో హ్యాండ్సప్ చెప్పటం.. ఇండియా కూటమి వ్యూహాత్మక వైఫల్యమే అని చెప్పాలి. విభేదాలు వస్తే.. ఎన్నికల్లో దెబ్బతిన్న పాత అనుభవాలు ఉన్నా కూడా.. ఇండియా కూటమి వాటిని ఖాతరు చేయకపోవడం.. ఐక్యంగా ప్రత్యర్థిని ఎదుర్కునే కంటే.. ఇగోలకే ప్రాధాన్యత ఇవ్వటం.. ఎన్డీఏ నెత్తిన పాలు పోసే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు వస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar CM Nitish Kumar latest
  • Bihar elections 2025
  • Bihar politics 2025
  • BJP attack on Tejashwi
  • Congress seat sharing

తాజావార్తలు

  • Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

  • Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్

  • Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

  • Oppo K14 5G: 7000mAh బ్యాటరీ బీస్ట్ Oppo K14 5G భారత్‌లో లాంచ్.. IP69 వాటర్‌ప్రూఫ్ + 50MP AI కెమెరా

  • Rakasa : భారీ మొత్తానికి రాకాస‌ హక్కుల అమ్మకం

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions